Eluru Crime: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం
- ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో దారుణం
- నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
- అర్ధరాత్రి పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru Crime: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. నూజివీడు మండలంలోని పల్లెర్లమూడిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.
Read Also: Suicide: ఆ వ్యాధితో బాధ పడుతూ.. భరించలేక గన్‌తో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య
Also Read
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
ఆదివారం రాత్రి 11 గంటలకు తల్లిదండ్రుల వద్ద నిద్రపోతున్న బాలికను ఎత్తుకెళ్లి.. పక్కనే ఉన్న పామాయిల్ తోటలో అత్యాచారానికి పాల్పడి ఆమెను అక్కడే వదిలి వెళ్లాడు. బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాలికను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోని బాలికకు అవసరమైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు చూస్తుంటే అది ఎవ్వరి నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు. ముక్కు పచ్చలారని చిన్నారులపై ఈ దుర్మార్గులు దుర్బుద్దితో వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవమానీయ ఘటనలు చోటు చేసుకోవడం శోచనీయం.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!