ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదని, కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయమని మేం సూచిస్తున్నామని, వరద వస్తేనే నీటిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు గంగుల కమలాకర్. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు లేవు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయరన్నారు. చాలా జిల్లాల్లో తాగునీరు, సాగు నీరు లేకుండా పోయిందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాకు చూపుతూ నీటిని లిఫ్ట్ చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారని, ఇప్పటికైనా కన్నేపల్లి పంప్ ఆన్ చేసి మిడ్ మానేరు నింపాలని డిమాండ్ చేస్తున్నానన్నారు గంగుల కమలాకర్. గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని చెప్పారు. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు లేవని చెప్పారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎందుకు లిఫ్ట్ చేయరని ప్రశ్నించారు.
Bangladesh Crisis: బంగ్లాదేశ్లో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్-బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్..!
చాలా జిల్లాల్లో తాగు, సాగు నీరు లేకుండా పోయిందని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాకు చూపుతూ నీటిని లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. అన్నారం, మేడిగడ్డ ద్వారా వివిధ రిజర్వాయర్లు నింపితే వచ్చే నీరు పాత మెదక్ జిల్లాకు చేరేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నింపి కూడవెళ్లి వాగు ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందేదని చెప్పారు. మొత్తంగా 3 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. పొలాలు ఎండిపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు విదేశీ పర్యటనలో ఉన్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
Strange Incident: ప్రయాణీకురాలి తలపై పేను కనిపించిందని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..