Health: ఈ సమస్య వల్ల గుండెపోటు ప్రమాదం.. సకాలంలో చికిత్స తీసుకోకుంటే..?
- హైబీపీ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం
- సకాలంలో చికిత్స తీసుకోకుంటే సమస్యలు
- రక్తపోటు వల్ల గుండె జబ్బులే కాకుండా..
- కిడ్నీ.. కాలేయం.. మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అందులో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ఇలాంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారి తీస్తాయి. ఈ సమస్యల బారిన యువత కూడా పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. అనేక దీర్ఘకాలిక వ్యాధులను సకాలంలో పరిష్కరించి చికిత్స చేస్తే వాటి కారణాలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉండవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధిక రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. నియంత్రణ లేకుండా ఉంటే, అది ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎవరికైనా అధిక రక్తపోటు (బీపీ) సమస్య ఉంటే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
Bangladesh protests: బంగ్లాదేశ్‌లో తీవ్ర రూపం దాల్చిన కోటా ఉద్యమం.. షేక్ హసీనా రాజీనామా?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే..?
హై బీపీ సమస్యను తరచుగా తేలికగా తీసుకుంటారు. ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమయ్యే వరకు దీనిని గుర్తించరు. దాని వల్ల నిరంతర అనియంత్రిత రక్తపోటు.. గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది. ఈరోజే మీ బీపీని చెక్ చేసుకోండి. అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులే కాకుండా కిడ్నీ, కాలేయం, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని, అందుకే సకాలంలో నియంత్రణకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపింది.
అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు ప్రమాదం
హైబీపీ ఉంటే గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా మయోకార్డియం (గుండె కండరం)లో నిర్మాణాత్మక, క్రియాత్మక మార్పులు ప్రారంభమవుతాయి. ఈ మార్పులలో ఎడమ జఠరిక యొక్క హైపర్ట్రోఫీ గుండె వైఫల్యానికి దారితీసే సమస్యలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. అధిక రక్తపోటు కారణంగా రక్త నాళాలపై అదనపు ఒత్తిడి ఉంటుంది. అవి చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు పరిస్థితి గుండెకు మాత్రమే కాకుండా మెదడుకు కూడా ప్రమాదకరమైనది. హైబీపీ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
రక్తపోటు పెరగడం వల్ల ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..
గుండె మాత్రమే కాకుండా అనేక ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. దీని కారణంగా.. కళ్ల రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దాంతో అనేక కంటి సంబంధిత వ్యాధులు, దృష్టి తగ్గడం మరి యు రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్తపోటు సమస్య కారణంగా.. మూత్రపిండాలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలలో సమస్యలు ఏర్పడుతుంది. అధిక రక్తపోటు అంగస్తంభన (నపుంసకత్వము) ప్రమాదాన్ని కూడా పెంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
రక్తపోటును ఎలా నియంత్రించాలి..?
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మందులతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించాలి. శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా యోగా ద్వారా ఉపశమనం పొందవచ్చు.
సమతుల్య ఆహారం తీసుకోండి.
సోడియం.. కెఫిన్ తీసుకోవడం తగ్గించండి.
ధూమపానం, మద్యం సేవించకూడదు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!