ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై బల్దియా కొరడా ఝళిపించింది. ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్న దుకాణాలను తొలగించారు. అబిడ్స్ నుంచి బషీర్ బాగ్ వరకు ఉన్న ఫుట్‌పాత్‌పై ఉన్న బండ్లను దుకాణాలను కూల్చివేశారు. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న జ్యూస్ బండ్లు, చాయ్ బండ్లు మిర్చి , టిఫిన్ బండ్లను తొలగించారు. ఈ సందర్భంగా… జీహెచ్ఎంసీ అధికారులతో చిరు వ్యాపారులు వాగ్వివాదానికి దిగారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేస్తున్న తమపై అధికారులు ప్రతాపం చూపింస్తున్నారని ఆరోపించారు. అక్రమ కూల్చివేతలను నిరసిస్తూ… అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు.
Warden Punishment: విద్యార్థులపాలిట యమదూతగా మారిన హాస్టల్ వార్డెన్..
ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డబ్బులను ధ్వంసం చేయడంపై… బీజేపీ స్థానిక కార్పోరేటర్ సురేఖ ఓం ప్రకాష్ మండిపడ్డారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నా… అన్యాయంగా వీరి పొట్ట మీద కొట్టడం సరికాదన్నారు. తక్షణమే వీరికి నష్టపరిహారం చెల్లించి… న్యాయం చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి, బీజేపీ నాయకులకు తీవ్ర వాగ్వివాదం జరగడంతో… కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?