నేడు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కోమటిరెడ్డి. నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యట. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనున్న ఐఐటీ ఇంజనీర్లు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత. నేడు రాజమండ్రిలో ఎంపీ పురందేశ్వరి పర్యటన. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న పురందేశ్వరి. మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే విస్తరణపై అధికారులతో సమీక్ష. తర్వాత ఢిల్లీకి…
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, డిప్యూటీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ వైబి ఖురానియాలను కేంద్రం శుక్రవారం తొలగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ క్యాడర్ అధికారి కాగా, ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా క్యాడర్ అధికారి. అగర్వాల్ గతేడాది జూన్‌లో బీఎస్ఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (పశ్చిమ)గా ఖురానియా బాధ్యతలు స్వీకరించారు.
భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు చివరి వరకూ పోరాడినప్పటికీ.. చరిత్ అసలంక చివరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు.
పూర్తి స్థాయి బడ్జెట్ మా ప్రభుత్వానికి ఇదే మొదటిది అని శాసన సభ వ్యవహారాల ఇంచార్జీ శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మొదటి సారి ఎన్నికైన ఎంఎల్ఏ లు కూడా చర్చలో పాల్గొన్నారని, రైతులకు లక్షన్నర రుణమాఫీ ఇక్కడి నుండే అమలు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు స్వాగతిస్తూ సభ లో సిఎం ప్రకటన చేశారని, యువత కి ప్రైవేటు రంగంలో నైపుణ్యం పెంచడానికి స్కిల్ యూనివర్సిటీ బిల్లు కు ఆమోదం చేసుకున్నామన్నారు. అదే…
అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన భట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7 8 తేదీల్లో…
పనే మొదలుపెట్టకముందు డీపీఆర్ ఉందా అంటున్నాడు కేటీఆర్‌అని, 10 వేల 800 మంది మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డీపీఆర్ ఉందా.? ఖచ్చితంగా మూసీకి డీపీఆర్ ఉంటుంది. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారని…