భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 240 పరుగులు చేసింది. భారత్ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (40), కామింధు మెండీస్ (40), దునిత్ వెల్లలాగే (39), కుశాల్ మెండీస్ (30) పర్వాలేదనిపించారు.
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీ కొట్టి కింద పడటంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ అబిడ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కామర్షియల్ కంప్లెక్స్ రెనవేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాజ్ మహాల్ హోటల్ పక్కనే ఉన్న బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే పక్కనే ఒ వెల్డింగ్ షాపు ఉండటంతో.. వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వల వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి.. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
Intimate Relationship: త్యాగానికి మారుపేరుగా నిలిచాడు బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి. బీహార్ రామ్‌నగర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల రాజేష్ కుమార్ తన భార్యని ఆమె ప్రేమించిన యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు.
పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించడము ద్వారా.. పరోక్షముగా స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సీపీ సుధీర్ బాబు మూసివేతకు ఆదేశించారు.
విశాఖలోని బీచ్ రోడ్డులో హ్యాండ్లూం శారీ వాక్ కలర్ఫుల్గా జరిగింది. సూర్యోదయం కాగానే వేలాది మహిళలతో చేపట్టిన శారీ వాక్ సంప్రదాయాలను చాటి చెప్పింది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ శారీ వాక్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. మంత్రి కూడా వైజాగ్ మహిళలతో కలిసి శారీ వాక్ చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి.
KTR Tweet: తెలంగాణకు మరిన్ని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాలకు వెళ్లింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.