భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 241 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో భారత్ బ్యాటర్లు విఫలమయ్యారు. 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత్ బ్యాటర్లు తడబడ్డారు. శ్రీలంక బౌలర్ల దాటికి టీమిండియా చేతులెత్తేసింది. టీమిండియా ఓపెనర్లు శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిడిలార్డర్లు ఫెయిల్ అయ్యారు. తొలి వన్డేలో కూడా అతి కష్టం మీద డ్రాగా ముగించారు. కానీ ఈ మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ల విజృంభణకు తట్టుకోలేకపోయారు.
Awadhesh Prasad: సీఎం యోగికి యాదవులు, ముస్లింలతో శత్రుత్వం.. బాలిక గ్యాంగ్‌రేప్‌పై అయోధ్య ఎంపీ..
భారత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనర్లు రోహిత్ శర్మ (64), గిల్ (35) రాణించారు. ఆ తర్వాత.. అక్షర్ పటేల్ (44) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ (14), వాషింగ్టన్ సుందర్ (15), శ్రేయాస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్, శివం దూబే డకౌట్ తో నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో జెఫ్రీ వాండర్సే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనొక్కడే 6 వికెట్లు పడగొట్టాడు. చరిత్ అసలంక 3 వికెట్లు తీశాడు.
Nipah virus: కేరళలో మళ్లీ నిపా వైరస్ ముప్పు..గబ్బిలాల నుంచి వ్యాప్తి
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 240 పరుగులు చేసింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (40), కామింధు మెండీస్ (40), దునిత్ వెల్లలాగే (39), కుశాల్ మెండీస్ (30) పర్వాలేదనిపించారు. శ్రీలంక బ్యాటింగ్లో ఓపెనర్ నిస్సాంకా మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. సమరవిక్రమ (14), జనిత్ లియాంగే (12), అఖిల ధనుంజయ (15) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 కీలక వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, సిరాజ్కు చెరో వికెట్ దక్కింది. కాగా.. మొదటి వన్డేలో శ్రీలంక 230 పరుగులు చేస్తే.. లక్ష్య చేధనలో భారత్ కూడా 230 పరుగులు చేసింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. అయితే.. ఈ మ్యాచ్లో 241 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఓటమి పాలయ్యారు. దీంతో.. 3 వన్డేల సిరీస్ లో భాగంగా, శ్రీలంక ఒకటి గెలిచింది. ఇంకొకటి టైగా ముగిసింది. ఈనెల 7వ తేదీన మూడో వన్డే జరుగనుంది.