కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. మణిపూర్‌లో మహిళపై అత్యాచార ఘటనలు బాధాకరమని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎప్పుడూ మన మీద ప్రేమ ఉండదని ఆరోపించారు. కానీ, మొన్న చంద్రబాబు తెలంగాణ భూములపై పాజిటివ్‌గా మాట్లాడారన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై ఓ వ్యక్తి దాడికి తెగబడిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని ఆయన ప్రశ్నించారు.
ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవం పురస్కరించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్బంగా.. విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పోలవరం అంతా పరిశీలించారని, సెల్ఫీ కూడా తీసుకున్నట్లు ఉన్నారని ఆయన తెలిపారు.
బీసీలకు బీజేపీ అండగా అంటుందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 1200 మంది బలిదానాల తరువాత తెలంగాణ ఏర్పడిందని.. కేసీఆర్ కు బీసీలంటే ఎందుకంత చిన్న చూపని మండిపడ్డారు.
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు మృగంలా ప్రవర్తించిన ఘటనలో తెలంగాణ మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
ముందస్తు లోక్‌సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు గాను 8 యూట్యూబ్ ఛానళ్లను (23 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు) కేంద్ర ప్రభుత్వం నిషేదిస్తున్నట్లు తెలిపింది.
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.