ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడుకుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా కర్నూలులో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Raghav Chadha: రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద సైఖోలు అని ఎమ్మెల్యే కాటసాని విమర్శించారు. ప్రజలు రాజకీయకులను చీదరించుకునేలా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కు చైతనైతే గడప గడపకు రా.. వాలంటీర్ల సేవ ఎంటో తెలుస్తుంది అని ఎమ్మెల్యే హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్ కు మంచి పేరు వస్తుందని భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నిజ జీవితంలో సినిమా డైలాగులు పనికిరావని విమర్శించారు.
Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
పవన్ కళ్యాణ్ నిన్న విశాఖలో మాట్లాడిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. ఎలా పడితే అలా మాట్లాడటం సరికాదని.. తోలు తీస్తే ఎదుటివాళ్ళు ఊరికే ఉంటారా అని ఆయన అన్నారు. మరోవైపు 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకుంటే ఏమి చేశావ్ పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే కాటసాని ప్రశ్నించారు.