Wild Mushrooms: సినిమాను మించిన క్రైం స్టోరీ.. పుట్టగొడుగులను తిని ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wild Mushrooms: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని చిన్న పట్టణంలో గత జులై 29న అడవి పుట్టగొడుగులు తిని ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతుండగా.. ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది. ఆస్ట్రేలియన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. ఎలాంటి క్లూస్ దొరకడం లేదు. కేసు చిక్కుముడి వీడడం లేదు. పోలీసులు ఆ ముగ్గురు ఎలా చనిపోయారనే దాని కారణాల కోసం వెతుకుతున్నారు. అదే రోజు ఇంట్లో వంట చేసిన మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. తరువాత ఆమెపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండా విడిచిపెట్టారు. అయితే ఆమె ప్రవర్తనపై మాత్రం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ALso Read: North Korea: యుద్ధానికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. సైనిక జనరల్‌గా కొత్త వ్యక్తి నియామకం
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
విక్టోరియా రాష్ట్రంలోని లియోంగథా పట్టణంలో ఓ మహిళ జులై 29న తన 70 ఏళ్ల అత్తమామలైన గెయిల్, డాన్ ప్యాటర్‌సన్, భర్త ఇయాన్ విల్కిన్సన్, పిన్ని వరుస అయ్యే హీతర్ విల్కిన్సన్, పాస్టర్‌ను విందుకు ఆహ్వానించింది. భోజనం చేసిన వెంటనే, నలుగురు అతిథులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. గ్యాస్ట్రో అని మొదట భావించినందున ఆసుపత్రికి తరలించారు. వారు ఉత్తమ వైద్య సంరక్షణను అందుకోవడానికి మెల్బోర్న్‌లోని ఆసుపత్రికి బదిలీ చేయబడ్డారు. కానీ ఆస్పత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. ఆ ఆహారం తిన్న నలుగురిలో మహిళకు చెందిన అత్తామామలు గెయిల్, డాన్ ప్యాటర్‌సన్, వారి బంధువు హీతర్ విల్కిన్సన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భర్త ఇయాన్ విల్కిన్సన్, బాప్టిస్ట్ పాస్టర్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళను అదుపులోకి విచారణ చేశారుఅయితే, 48 ఏళ్ల మహిళ ఏమి జరిగిందనే దాని గురించి తనకు ఎలాంటి క్లూ లేదని, తన కుటుంబం పట్ల తనకున్న ప్రేమను నొక్కి చెప్పింది. వారిని బాధపెట్టే ఉద్దేశాన్ని తిరస్కరించింది. హత్యానేరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Russia: ఇస్రోతో రోస్కోస్మోస్ పోటీ.. చంద్రయాన్‌కు పోటీగా రష్యా లూనా-25
సోమవారం విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ డీన్ థామస్ మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లలు కూడా భోజనానికి హాజరయ్యారని, అయితే వారు అనారోగ్యంతో లేరని తెలిపారు. చనిపోయిన వారికి కాకుండా పిల్లలకు వేరే భోజనం వడ్డించారని పోలీసులు భావిస్తున్నారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. చనిపోయిన వారు ఏ రకమైన పుట్టగొడుగులను తిన్నారో స్పష్టంగా తెలియదన్నారు. వారి మరణం వెనుక కుట్ర జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలియడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నామని వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు.
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..