సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీ కులవృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 300 మందికి బీసీ కులవృత్తుల చెక్కుల పంపిణీ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గతంలో 10వేల రూపాయలు సహాయం కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. ఒక్కసారి లబ్ధిపొందిన మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చేవి కాదని, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి పారుతున్న సాగునీరును ఆంధ్రప్రాంతానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది అని ఆయన విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ డ్యామ్ కటింది తెలంగాణ ప్రజలు.. ఎక్కడో ఉన్న ఆంధ్ర వాళ్ళు వచ్చి నీళ్లు తీసుకెళ్లారని, చివరి ప్రాంతాలకు గోదావరి నీళ్లను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది అని ఆయన కొనియాడారు.
Also Read : MLA Katasani Rambhupal Reddy: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు
నాగార్జున సాగర్ ఎడమ కాలువ కు సైతం గోదావరి నీళ్లు అందిస్తామని ఆయన వెల్లడించారు. రైతుల పక్షపాతి కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. 14 కులాలకు కులవృత్తుల అందించాలనే సంకల్పంతో కులవృత్తులలో భాగంగా ఆర్థిక సహాయం అందిస్తుందని, 2018 మల్లయ్య యాదవ్ గెలవడం వల్లనే అభివృద్ధి జరుగుతుందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మళ్ళీ ఘనవిజయం సాధించాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పథకాల అమలులో రాష్ట్రం చాలా ముందుందని చెప్పారు. మహిళల హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్‌తో ఆడబిడ్డలకు పౌష్టికాహారం అందిస్తూ.. కళ్యాణలక్ష్మి కింద ఆడపిల్లల పెళ్లి ఖర్చులు చూసుకుంటూ కుటుంబ పెద్దగా నిలిచారన్నారు.
Also Read : Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే