కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు.
పాము, ముంగిస ఒకదానికి ఒకటి తారసపడ్డాయంటే..ఇక భీకర పోరే. అవి పొట్లాడుకున్న దృశ్యాలు మనం గతంలో చూసే ఉంటాం. అయితే నడిరోడ్డుపై తాచుపాము, ముంగిస భీకరంగా దాడి చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది.
యువతిని వివస్త్రను చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను గవర్నర్ ఆదేశించారు.
జవహర్ నగర్ బాధిత మహిళ ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బాధిత మహిళకు అండగా ఉంటామని తెలిపారు. అంతేకాకుండా.. బాధిత మహిళకు మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ పథకానికి సంబంధించి ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మీ పథకానికి ఎలాంటి గడువు లేదని మంత్రి స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా.. నగరంలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమమని తెలిపారు. ఎన్నికలు వస్తే సంక్రాంతి గంగిరెద్దుల వచ్చినట్లు వస్తారు.. జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు.
వారాహి యాత్రకు వస్తున్న పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారాహి వెబ్ సిరీస్ 3 అంటూ వ్యాఖ్యానించారు మంత్రి. ఉత్తరాంధ్రలో అక్రమాలు అన్యాయాలపై ప్రశ్నిస్తానంటున్న ప్యాకేజ్ స్టార్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు.