టీ అంటే అందరికి ఇష్టమే.. రోజు పొద్దున లేవగానే టీ తాగకుండా ఎవరూ ఉండలేరు. ఉదయాన్నే టీ తాగారంటే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. కొందరు అన్నం తినకుండానైనా ఉంటారు గానీ.. టీ తాగకుండా ఉండలేరు. అంతేకాకుండా టీ తాగడం వలన కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందులో గ్రీన్ టీ తాగితే ఇంక మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Russia: ఇస్రోతో రోస్కోస్మోస్ పోటీ.. చంద్రయాన్‌కు పోటీగా రష్యా లూనా-25
ఇటీవలే గ్రీన్ టీని ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇది తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Allu Arjun: పుష్పగాడి స్టైల్ అంటార్రా బాబు..
1. బరువు తగ్గడం..
మీరు అధిక బరువుతో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. ఈ గ్రీన్ టీ తీసుకుంటే బరువు విషయంలో మార్పు వస్తుంది. రోజు ఒక్కసారైనా గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గుతారు. అంతేకాకుండా.. ఓవరాల్ గా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..
ఈ మధ్యకాలంలో గుండె జబ్బుల సమస్యలతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్య రాకుండా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. అంతేకాకుండా.. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఆర్టరీస్‌లో ప్లేక్ ఫార్మ్ అయ్యి గుండె జబ్బులకి స్ట్రోక్‌కీ దారి తీస్తుంది. అందుకోసం గ్రీన్ టీ తాగితే.. అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి.
3. కాన్సర్ రిస్క్ తగ్గించి..
ఫ్రీ రాడిలస్ వల్ల జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాన్సర్‌కి దారితీస్తుంది. ఈ డ్యామేజ్ జరగకుండా గ్రీన్ టీ ప్రొటెక్ట్ చేస్తుంది, ఫలితంగా కాన్సర్ వచ్చే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది.
4. ముడతలు రాకుండా..
గ్రీన్ టీ తాగడం వల్ల పాలీ ఫెనాల్స్ స్కిన్ ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. దీంతో ముడతలు రాకుండా చేసి కొలాజెన్ ఏజీయింగ్‌ని డిలే చేస్తాయి.
5. బీపీ తగ్గించి..
గ్రీన్ టీ తాగడం వల్ల హైబీపీ రిస్క్ తగ్గుతుందని చెప్పొచ్చు. హైబీపీకి కారణమయ్యే హార్మోన్‌ని గ్రీన్ టీ అణిచి వేస్తుంది.
6. జుట్టు ఊడకుండా..
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్‌లాస్‌ని ప్రివెంట్ చేస్తాయి. హెయిర్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేసి జుట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి.