కాసేపట్లో దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు.. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హాట్ ఫేవరెట్ చక్ దే ఇండియా స్లోగన్స్ తో హోరెత్తిస్తున్నారు. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించాలని అభిమానులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.
అందులో భాగంగా.. ఖైరతాబాద్ గణేష్ టెంపుల్ లో పూజలు నిర్వహించారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలని పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛాంపియన్ ట్రోఫీ గెలవాలని పూజలు, ప్రత్యేక హోమం చేశారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి & క్రికెట్ ఫ్యాన్స్ మాట్లాడుతూ.. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. భారత్ గెలవాలని గణపతి హోమం పూజలు చేసామని అన్నారు. టీమిండియాకి శక్తినివ్వాలి.. దైవసంకల్పంతో కప్పు గెలవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. గత టీ20 వరల్డ్ కప్ లో అద్భుతం జరిగింది.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ద్వారా గెలిచింది.. 2000లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడింది.. బట్ ఈరోజు ఫైనల్ కప్పు గెలుస్తుందని చెప్పారు. రెండు టీంలు సమజ్జీవులే.. టీమిండియాకు గణనాధుని దీవెనలు ఉంటాయని చెప్పారు. గణపతికి ఉదయమే పూజలు చేసాం.. గణపతి హోమం నిర్వహించామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు.
Read Also: SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఆపరేషన్‌లో కీలక పురోగతి..