Champions Trophy Final: న్యూజిలాండ్తో ఫైనల్ ఫైట్.. కివీస్ కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న రోహిత్..?
- కాసేపట్లో భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్..
- భారత్ జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు టాక్..
- కివీస్ కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy Final: దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు భారత్ రెడీ అయింది. మరి తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే, మరోసారి నలుగురు స్పిన్నర్లతో ఆడిస్తే మంచిదని క్రికెట్ పండితులు అంటున్నారు. 25 ఏళ్ల తర్వాత కివీస్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తలపడుతుండటంతో తుది జట్టు ఎంపిక అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఒకే మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Read Also: Bollywood : యాడ్ ద్వారా చిక్కులో పడిన స్టార్ హీరోలు
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
అయితే, ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.. కానీ, అతడు తుది పోరులో ఆడటం ఖాయమని బీసీసీఐ వెల్లడించింది. దీంతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత విరాట్ వన్‌డౌన్‌లో రానుండగా.. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య తర్వాత బ్యాటింగ్‌కు రానున్నారు. దీంతో మరోసారి రిషభ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌కు అత్యంత కీలకం స్పిన్ డిపార్ట్మెంట్.. గత మ్యాచుల్లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత జట్టు.. మరోసారి అదే కాంబినేషన్‌తో ఫైనల్ లో ఆడబోతుంది. ఇక, ఒక్క మార్పు చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు కుడి చేతి వాటం స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కుల్‌దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తారని సమాచారం.
Read Also: Chelluboyina Venu: ప్రజాజీవనాన్ని మార్చడానికి ప్రయత్నించింది వైసీపీ
కాగా, గత రెండు మ్యాచుల్లో కుల్‌దీప్ 17.3 ఓవర్లు వేసి 100 రన్స్ ఇచ్చి కేవలం 2 వికెట్లే తీసుకున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టి.. సుందర్‌ను తీసుకుంటే 9వ నంబర్ వరకు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తున్నందున బ్యాటింగ్ కూడా చాలా కీలకమే కానుంది. ఇప్పటికే, జడేజా, అక్షర్, వరుణ్ చక్రవర్తితో కూడిన స్పిన్ విభాగం స్ట్రాంగ్ గా ఉంది. వారికి తోడుగా సుందర్‌ను తీసుకొస్తారని తెలుస్తుంది. కానీ, తుది జట్టుపై ఇప్పటి వరకు టీమ్ నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం రాలేదు.
తాజావార్తలు
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!