Mayank Agarwal: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాను మూడు వరుస మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న ఈ ఆటగాడు, ఈ ట్రోఫీలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన రౌండ్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో…
IND vs AUS Test: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. 340 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకు ఆలౌట్ అయింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుండటంతో.. #HappyRetirement అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
IND vs AUS: మెల్బోర్న్ టెస్ట్‌లో ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 రన్స్ భారీ లక్ష్యంతో ఐదో రోజు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత జట్టు కేవలం 33 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది.
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య మెల్బోర్న్ లో నాల్గవ టెస్టు మ్యా్చ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. 8వ నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై…
IND vs AUS: భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యతను సాధించింది. తొమ్మిది వికెట్లు కోల్పోయినా, వెనుకంజ వేయకుండా ఫైటింగ్ స్పిరిట్‌ను ప్రదర్శిస్తూ, భారత్‌పై 333 పరుగుల ఆధిక్యతను నెలకొల్పింది. మైదానంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇక, ఆస్ట్రేలియాకు ఇంకా ఒక వికెట్ మిగిలినందున, ఈ ఆధిక్యత మరింత పెరిగే అవకాశముంది. ఐదో రోజు తొలి సెషన్లో…
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో, కెప్టెన్ పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టులో శామ్ కాన్స్టాస్ 65 బంతుల్లో 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 121 బంతుల్లో 57 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 145…
Kohli vs Konstas: ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు హీటెక్కింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్లేయర్ సామ్ కాన్స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు.. బుమ్రా మరో రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనతో.. టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్‌గా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.