ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యా్చ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎన్టీవీతో యువ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్, కోచెస్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టీం ఇండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ తీసుకోవాలని.. 350+ రన్స్ సాధించి న్యూజిలాండ్‌కి టార్గెట్ ఇవ్వాలని తెలిపారు. కాగా.. ఫైనల్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Medak: మెదక్ జిల్లాలో భారీ సంఖ్యలో నాటు కోళ్లు మృతి..
అందరి హాట్ ఫేవరెట్ టీం ఇండియానే.. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జడేజా స్పిన్ మాయజాలంతో న్యూజిలాండ్ బ్యాటర్లను త్వరగా ఔట్ చేయాలన్నారు. పేస్ బౌలింగ్‌లోని మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా లైన్ అండ్ లెన్త్ వేస్తున్నారని చెప్పారు. భారత్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మినహా ఎక్కడ న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడలేదని పేర్కొన్నారు. ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యారు, కేఎల్ రాహుల్ హార్ధిక్ పాండ్యా పైనే బ్యాటింగ్ భారం అంతా ఉంది. కివీస్ బ్యాటర్లను కూడా తక్కువ అంచనా వేయలేము.. రచిన్ రవీంద్ర, విలియమ్సన్ మంచి ఫామ్ లో ఉన్నారని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు.
Read Also: Yash : బాలీవుడ్ ‘రామాయణ్’ షూటింగ్ పై తాజా అప్ డేట్ !