శిఖర్ ధావన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన గబ్బర్.. మైదానంలో తన చిలిపి చేష్టలతో నవ్వులు పూయించేవాడు. ఇక కరోనా మహమ్మారి సమయంలో మాజీ సతీమణి, కుమారుడితో రీల్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల కాస్త సైలెంట్ అయిన ధావన్.. మళ్లీ మొదలెట్టాడు. తాజాగా ఓ సరదా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శిఖర్ ధావన్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆట కంటే పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కాదన్నారు. టీమిండియా సూపర్‌స్టార్ సంస్కృతిని వీడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో భజ్జీ మరో పోస్ట్ చేశారు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా…
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే విలేకరుల ముందుకు వచ్చిన యాష్.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. సిరీస్ మధ్యలోనే అశ్విన్ సడన్‌గా రిటైర్మెంట్ ఇవ్వడంతో భారత అభిమానులతో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. తాజాగా అశ్విన్ రిటైర్మెంట్పై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.…
ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టం.. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నాను అని తెలిపాడు. ఇక, ధోనీ ఈ దేశానికి హీరో.. వ్యక్తిగతంగా, క్రికెటర్‌గా ఆయన నుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నాను.. మిస్టర్ కూల్ ఉన్నాడంటే.. జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని రిషభ్ పంత్ వెల్లడించారు.
Gautam Gambhir: సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్‌పై కీలక కామెంట్స్ చేశాడు.
IND vs AUS: టీమిండియా మరోసారి తక్కువ పరుగులకే అలౌటై క్రికెట్ అభిమానులను నివసిపరిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మొదలుకాగా.. మొదటి రోజే టీమిండియా 185 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వరుస క్రమంలో టికెట్లు కోల్పోతూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.…
అందరూ అనుకున్నదే నిజమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్‌కు మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదవ టెస్టులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు బుమ్రా చెప్పాడు. శుభ్‌మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్…
Akash Deep: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరమయ్యాడు. వెన్ను సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆకాశ్ దీప్, సిడ్నీ టెస్టుకు అందుబాటులో ఉండడని భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉన్న టీమిండియాకు ఆకాశ్ దీప్ గైర్హాజరీ ఓ ఎదురుదెబ్బగా మారనుంది. గత రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లు తీసి కీలక పాత్ర…
సిడ్నీ వేదికగా రేపటి (జనవరి 2) నుంచి ఆసీస్‌తో ఐదో టెస్టు ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పిస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, వీటికి టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
Gautam Gambhir: టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ మినహా న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరాభవాలతో భారత జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టీమ్ ను గాడిన పెట్టేందుకు కోచ్ గంభీర్ కఠినంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది.