టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న నమీబియాతో ఆడుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. అంతర్జాతీయT20 క్రికెట్లో 3వేలకు పైగా పరుగులను సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.రోహిత్ ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2సిక్స్‌లు) పరుగులు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 108 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత…
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరుకోలేదు అనే విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… టీం ఇండియా ఓడిపోయిన రెండు మ్యాచ్ లలో టాస్ ప్రధాన పాత్ర పోషించిందని అన్నాడు. టాస్ ఓడిపోవడం వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆ మిగిత జట్లకు కలిసి వచ్చింది అన్నారు. అయితే ఈ మాటలను కొట్టిపారేశారు భారత సీనియర్ బౌలర్ హర్భజన్…
టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు వెళ్లకుండానే నిష్క్రమించనుంది. సోమవారం నామమాత్రంగా జరగనున్న మ్యాచ్‌లో నమీబియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. ఓడినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్ పరాజయాలకు టాస్ కారణమన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. భారత్ ఓటములకు టాస్ ఎంత మాత్రం కారణం కాదన్నారు. మన బ్యాట్స్‌మెన్ వైఫల్యంతోనే జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిందన్నాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్…
ఈరోజు న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై టీం ఇండియాతో పాటు భారత అభిమానులు మొత్తం ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో ఆఫ్మఘం గెలవాలని అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 ఒరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో నజీబుల్లా ఒక్కడే 73 పరుగులతో రాణించాడు.…
ఈరోజు యావత్ భారతం అప్ఘనిస్తాన్ వైపు నిలబడనుంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ అవకాశాలు ఆ జట్టు చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్ఘనిస్తాన్ జట్టుపై భారత ఆటగాళ్లు, పలువురు నెటిజన్లు తెగ మీమ్స్ షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లోని ఫైట్ సీన్లకు డైలాగులు జోడిస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఈ మీమ్స్‌లో రషీద్ ఖాన్‌పై చేసిన మీమ్ తెగ ఆకట్టుకుంటోంది. ధోనీ, కోహ్లీ, రోహిత్ కలిసి రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతున్న ఫోటో ఫన్నీగా ఉంది.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ప్రదర్శన సగటు క్రికెట్ అభిమాను లను నిరాశ పర్చింది. దీంతో సెమీస్‌లో స్థానం దక్కించు కోవాలంటే పోరాడక తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్లిపోయింది భారత జట్టు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీంఇండియా ఈసారి అభిమానులను తీవ్ర నిరాశ పర్చింది. ప్రస్తుతం భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ అద్భుతం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ సెమీస్ చేరాలంటే స్కాంట్లాండ్‌పై, నవంబర్8న నమీబియాపై భారీ తేడా(80 పరుగుల తేడాతో లేదా12…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి అయోమయంగా మారింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్ జట్టు పసికూనల చేతిలో ఓ మ్యాచ్‌లో ఓడిపోవాలని టీమిండియా అభిమానులు కోరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం టీమిండియా ఫైనల్‌కు రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే అక్కడ మరోసారి భారత్‌ను ఓడించాలని భావిస్తున్నామని, దాని కోసం తమకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఇప్పుడు ‘మౌకా’ అనే పదం ఎంతమాత్రం…
ఒకవైపు టీ20 ప్రపంచకప్ జరుగుతుండగానే.. మరోవైపు భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు సన్నద్ధమవుతోంది. నవంబర్ 17 నుంచి టీమిండియాతో మూడు టీ20లతో పాటు మూడు టెస్టులను ఆ జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టెస్టులకు ప్రధాన బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు సెలక్టర్లు విశాంత్రి ఇచ్చారు. Read Also: వెల్లివిరిసిన మతసామరస్యం.. రాముడికి ముస్లిం మహిళల హారతి టీ20 జట్టు:…
భారత్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్‌తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన,…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం పసికూన స్కాట్లాండ్తో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోహ్లీ సేన సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గత మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించాల్సి ఉంది. ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లోనూ వారిద్దరూ చెలరేగి…