ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ నుండి కెప్టెన్ గా తప్పుకున్నాడు. దాంతో తాజాగా బీసీసీఐ… వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ లు ఉండటం సరికాదని వన్డే కెప్టెన్సీ నుండి కూడా విరాట్ కోహ్లీని తప్పిస్తూ.. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించింది. ఈ విషయాన్ని ఈ నెల చివర్లో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వెల్లడించింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టుతో టీం ఇండియా వన్డే సిరీస్ లో కూడా పాల్గొననుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వన్డే సిరీస్ కు కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తాను వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉండాలనుకున్నా.. తప్పించిన బీసీసీఐపై కోహ్లీ కోపంతో ఉన్నట్లు సమాచారం. అందుకే కోహ్లీ ఈ వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉందో.