CM Revanth Reddy : హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి
- హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి
- ప్రతీరోజు చెత్త సేకరణ జరగాల్సిందే
- క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి
- కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్ కు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Surya Kumar Yadav: బిగ్‌షాక్.. రేపు రిటైర్‌మెంట్ ప్రకటించనున్న సూర్యకుమార్ యాదవ్..!?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!