యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత.. ఈ ఫార్మాట్ లో కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చెప్పట్టాడు. అందులో కివీస్ ను టీం ఇండియా క్లిన్ స్వీప్ చేసింది. ఇక ఈ నెలలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుండగా… నిన్న సౌత్ ఆఫ్రికాతో తలపడే టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వన్డే కెప్టెన్ గా కూడా రోహిత్ నే నియమిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అయితే విరాట్ కోహ్లీకి ఉన్న నాయకత్వ నైపుణ్యంతో పాటు అలాంటి బ్యాటర్ జట్టులో ఉండటం చాలా అవసరమని హిట్ మ్యాన్ చెప్పాడు.
టీ 20 ఫార్మాట్ లో 50 కి పైగా సగటు చాలా కష్టం… అవాస్తవం. కానీ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ తో పాటుగా మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో ఉన్నాడు. విరాట్ క్లిష్ట పరిస్థితులలో తన అనుభవంతో బ్యాటింగ్ చేసి చాలా సార్లు భారత జట్టును గట్టెక్కించాడు అని రోహిత్ చెప్పాడు. అయితే ఏది ఏమైనా కోహ్లీని వన్డే కాప్టెన్సీ నుంచి తప్పించడం చాలా మంది క్రికెట్ అభిమానులకు ఓ షాక్ అనే చెప్పాలి.