భారత స్టార్ టెస్ట్ అఆటగాడు అజింక్య రహానే ఈ ఏడాది లో ఫామ్ కోల్పోయి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా కివీస్ జరిగిన మొదటి మ్యాచ్ లో జట్టు కెప్టెన్ గా వ్యవహరించి కూడా విఫలమయ్యాడు. అయిన కూడా ఈ నెలలో టీం ఇండియా వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనకు ఎంపికైన రహానే… తన పేలవ ప్రదర్శన కారణంగా విశ్ కెప్టెన్ గా బాధ్యలను కోల్పోయాడు. అయితే ఈ పర్యటనకు రహానే వెళ్తున్న అక్కడ తుది జట్టులో అతను స్థానం దక్కించుకోవడం కష్టమే అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు.
ఎందుకంటే.. సరిగ్గా రహానే విఫలమవుతున్న సమయంలో జట్టులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ శతకంతో ఆకట్టుకున్నాడు. అందువల్ల అతడిని తప్పించడం కుదరదు. అలాగే హనుమ విహారి కూడా బాగా ఆడుతున్నాడు. కానీ విదేశాలలో ఉన్న అనుభవం వల్ల రహానేను జట్టులో చేర్చారు. అయితే అక్కడ తప్పకుండ అనుభవం అవసరం. కానీ అతను జట్టులో ఉంటాడా అనేది తెలియదు. అందుకే మొదటి టెస్ట్ మ్యాచ్ రహానేకు చాలా కీలకం అని గంభీర్ అన్నారు.