ఈరోజు యావత్ భారతం అప్ఘనిస్తాన్ వైపు నిలబడనుంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ అవకాశాలు ఆ జట్టు చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్ఘనిస్తాన్ జట్టుపై భారత ఆటగాళ్లు, పలువురు నెటిజన్లు తెగ మీమ్స్ షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లోని ఫైట్ సీన్లకు డైలాగులు జోడిస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఈ మీమ్స్‌లో రషీద్ ఖాన్‌పై చేసిన మీమ్ తెగ ఆకట్టుకుంటోంది. ధోనీ, కోహ్లీ, రోహిత్ కలిసి రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతున్న ఫోటో ఫన్నీగా ఉంది.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ప్రదర్శన సగటు క్రికెట్ అభిమాను లను నిరాశ పర్చింది. దీంతో సెమీస్‌లో స్థానం దక్కించు కోవాలంటే పోరాడక తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్లిపోయింది భారత జట్టు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీంఇండియా ఈసారి అభిమానులను తీవ్ర నిరాశ పర్చింది. ప్రస్తుతం భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ అద్భుతం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ సెమీస్ చేరాలంటే స్కాంట్లాండ్‌పై, నవంబర్8న నమీబియాపై భారీ తేడా(80 పరుగుల తేడాతో లేదా12…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి అయోమయంగా మారింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్ జట్టు పసికూనల చేతిలో ఓ మ్యాచ్‌లో ఓడిపోవాలని టీమిండియా అభిమానులు కోరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం టీమిండియా ఫైనల్‌కు రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే అక్కడ మరోసారి భారత్‌ను ఓడించాలని భావిస్తున్నామని, దాని కోసం తమకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఇప్పుడు ‘మౌకా’ అనే పదం ఎంతమాత్రం…
ఒకవైపు టీ20 ప్రపంచకప్ జరుగుతుండగానే.. మరోవైపు భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు సన్నద్ధమవుతోంది. నవంబర్ 17 నుంచి టీమిండియాతో మూడు టీ20లతో పాటు మూడు టెస్టులను ఆ జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టెస్టులకు ప్రధాన బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు సెలక్టర్లు విశాంత్రి ఇచ్చారు. Read Also: వెల్లివిరిసిన మతసామరస్యం.. రాముడికి ముస్లిం మహిళల హారతి టీ20 జట్టు:…
భారత్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్‌తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన,…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం పసికూన స్కాట్లాండ్తో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోహ్లీ సేన సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గత మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించాల్సి ఉంది. ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లోనూ వారిద్దరూ చెలరేగి…
t20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తర్వాత టీ20లో ఇండియా సారథి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. దీంతో టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రావిడ్ పరిమిత ఓవర్లలో టీమిండియాకు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఉండవ చ్చని అన్నాడు. అతడికి ఉన్న అనుభవం దృష్య్టా కెప్టెన్‌గా రోహితే తన ఫస్ట్ ఛాయిస్ అని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత విరాట్…
ప్రస్తుతం మూడు గంటల్లో ముగిసిపోయే టీ20 మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ఐపీఎల్, బిగ్‌బాష్ వంటి టోర్నీలు సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే టీ20 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాలకు సంబంధించిన పలు రికార్డుల గురించి మనకు తెలుసు. కానీ ధనాధన్ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారో మీకు తెలుసా? Read Also: దీపావళి అంటే చాలు.. రెచ్చిపోతున్న రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20…
టీమిండియా కొత్త కోచ్‌గా.. భారత మాజీ క్రికెటర్, మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే, అండర్-19, భారత్-ఏ జట్లపై.. అత్యుత్తమమైన కోచ్‌గా చెరగని ముద్ర వేసిన రాహుల్… ఇకపై భారత్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అండర్-19 జట్టును ఒకసారి రన్నరప్‌గా… మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు ద్రవిడ్. టీ20 ప్రపంచకప్ తర్వాత.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుండటంతో.. తదుపరి కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. అయితే, దీనికి రాహుల్ ద్రవిడ్…
ఏవైనా స్పెషల్ డేస్ వస్తే రోహిత్ శర్మకు ఊపు వస్తుందని మరోసారి రుజువైంది. దీపావళి పండగకు, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. దీపావళి అంటే చాలు రోహిత్ రెచ్చిపోతున్నాడు. దీపావళి సందర్భంగా ఆరోజు లేదా అంతకుముందు రోజు జరిగే మ్యాచ్‌లలో రోహిత్ విశ్వరూపం చూపిస్తున్నాడు. Read Also: టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత్ 2013లో దీపావళి సమయంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో తొలిసారిగా డబుల్ సెంచరీ చేశాడు. 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన…