టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల వివాహమై నాలుగు వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ భావోద్వేగంతో ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నాలుగేళ్లుగా నేను వేసిన సిల్లీ జోకులను, నా బద్ధకాన్ని భరించావు. నేను ఎంత చికాకుగా ఉన్నా ప్రేమించావు. నాలుగేళ్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో నిజాయితీ, ప్రేమ, ధైర్యం ప్రదర్శించిన మహిళగా వృద్ధి చెందావు. గత నాలుగేళ్లలో నాలో ఎంతో స్ఫూర్తి నింపి నన్ను మార్చివేశావు. వామిక మన జీవితంలోకి రావడంతో మన లైఫ్ పరిపూర్ణంగా మారింది. కుటుంబంగా ఇది తొలి వార్షికోత్సవం. నిన్ను ఎల్లవేళలా ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ కోహ్లీ తన జీవిత భాగస్వామి అనుష్క శర్మకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
Read Also: యాషెస్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్
కాగా కోహ్లీ తన ట్వీట్‌లో అనుష్క శర్మ, వామికతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో కూడా వామిక ఫేస్‌ను కోహ్లీ రివీల్ చేయలేదు. అయితే ఈ జంట ఎంతో క్యూట్‌గా కనిపించింది. తన కుటుంబంతో కోహ్లీ షేర్ చేసిన ఫోటోను చూసి అతడి అభిమానులు మురిసిపోతున్నారు. కోహ్లీకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2017 డిసెంబర్ 11న కోహ్లీ, అనుష్కశర్మ పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న వీరికి వామిక జన్మించిన సంగతి తెలిసిందే.
(1/3)
— Virat Kohli (@imVkohli) December 11, 2021
4 Years of you handling my silly jokes and my laziness 🤪. 4 years of you accepting me for who Iam everyday and loving me regardless of how annoying I can be. 4 years of the greatest blessing god could’ve showered on us. pic.twitter.com/SvsGCePjy7