Redeveloping Colonies: సొంత నిధులతో కొత్త భవనాలు.. ఢిల్లీలో 7 ప్రభుత్వ కాలనీలకు కొత్త కళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని పాతబడిన ఏడు ప్రభుత్వ నివాస కాలనీలను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రజలకు సంబంధించి పన్నుల రూపంలో వచ్చిన డబ్బును ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. సరోజినీ నగర్, నేతాజీ నగర్, నౌరోజీ నగర్, కస్తూరిబా నగర్, త్యాగరాజ్ నగర్, శ్రీనివాసపురి, మహమ్మద్‌పూర్ వంటి సుమారు 537 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాల్లో ఈ పనులు జరుగుతున్నాయి.

Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఈ కాలనీల్లోని చాలా ఇళ్లు పాతబడిపోయి, నివాసానికి ప్రమాదకరంగా మారాయి. దాదాపు 40 శాతం ఇళ్లు ఉండటానికి వీలు లేని స్థితికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో 20 వేలకు పైగా ఇళ్ల కొరత ఏర్పడింది. అందుకే పాతబడిన చిన్న బిల్డింగుల స్థానంలో.. అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక అపార్ట్‌మెంట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల 21,000 కొత్త ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. మార్చి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 2,722 కొత్త ఫ్లాట్లను ప్రారంభించనున్నారు.

అలాగే సరోజినీ నగర్, నేతాజీ నగర్ వంటి ప్రాంతాల్లో మరో 6,632 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 537 ఎకరాల్లో కేవలం 13 శాతం భూమిని (అంటే సుమారు 69 ఎకరాలు) వ్యాపార సంస్థలకు లేదా ప్రైవేట్ నివాసాలకు కేటాయించి నగదుగా మారుస్తారు.

దీని ద్వారా సుమారు రూ.35,100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.32,800 కోట్లు. అంటే.. నిర్మాణ ఖర్చులు పోను ప్రభుత్వానికి అదనంగా మరో రూ.2,300 కోట్ల మిగులు ఆదాయం కూడా వస్తుంది. ప్రభుత్వ ఖజానాపై పైసా భారం పడకుండా.. వేలాది మంది ఉద్యోగులకు కొత్త ఇళ్లను అందించేలా ఈ పనులు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!