మరికాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఈ రెండు జట్లు ఓడిపోయాయి. దీంతో ఈరోజు జరిగే పోరు ఇరుజట్లకు చావో రేవో లాంటిది. ఈ పోరులో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..? Also Read: ధోనీ అభిమానులకు ఈరోజు మరపురాని రోజు ఈ…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు అక్టోబర్ 31 మరపురాని రోజు అని చెప్పాలి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు ధోనీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 2005లో శ్రీలంకతో టీమిండియా ఏడు వన్డేల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ధోని తన మాస్టర్ స్ట్రోక్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 299 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. అక్టోబర్ 31,2005 జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్…
టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. బాబర్ ఆడిన 26వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. గతంలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు సాధించి రికార్డు సృష్టించగా..…
వచ్చే ఆదివారం టీం ఇండియా ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లోనే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టుకు కొన్ని సూచనలు చేసారు లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. కివీస్ పై మ్యాచ్ లో హార్దిక్ పాండ్య అలాగే భువనేశ్వర్ కుమార్ లను పాకాన పెట్టాలి అని సునీల్ తెలిపారు. వీరి స్థానాల్లో ఇషాన్ కిషన్ అలాగే శార్దూల ఠాకూర్ లను…
ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో భారత్ ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయింది. ఇక ఈ వచ్చే ఆదివారం తమ రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో జట్టు ఓపెనింగ్ పై భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొన్ని సలహాలు ఇచ్చాడు. కిసీస్ పై రోహిత్ శర్మతో పాటుగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ను తీసుకుంటే బాగుంటుంది అని అన్నాడు.…
టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తన అభిమానులకు గుడ్‌న్యూస్ అందించాడు. దినేష్ కార్తీక్, దీపిక పల్లికల్ జంటకు గురువారం నాడు కవల పిల్లలు జన్మించారు. దీంతో ఈ శుభవార్తను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ముగ్గురం కాస్తా.. ఐదుగురం అయ్యాం. దీపిక, నేను ఇద్దరు అందమైన మగ పిల్లలతో ఆశీర్వాదం పొందాం. ఇంతకన్నా సంతోషంగా ఉండలేము’ అంటూ డీకే రాసుకొచ్చాడు. అంతేకాకుండా తన కవల పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓడిపోవడంతో అందరూ భారత బౌలర్ షమీని నిందించారు. అతడిపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో విజయానికి బంతికో పరుగు అవసరం కాగా.. 18 ఓవర్‌ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీచేత వేయించాడు. అయితే మంచు ఎక్కువగా కురవడం, బంతి చేతికి చిక్కకపోవడంతో షమీ వరుసగా 6, 4, 4 సమర్పించుకున్నాడు. దీంతో పాకిస్థాన్ విజయం తేలికైపోయింది. భారత్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ మొదలైంది.…
ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ యొక్క భారత జట్టు ఎంపికలో మొదటి నుండి చర్చలకు దారి తీస్తుంది ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. అయితే గత రెండు ఐపీఎల్ సిజ్ఞలలో బౌలింగ్ చేయలేక… ఫిట్నెస్ కారణాలతో ఇబ్బంది పడుతున్న పాండ్య భారత జట్టు ఈ టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్ లో ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో భుజం గాయం కారణంగా తర్వాత ఫిల్డింగ్ చేయలేదు. అయితే ఆ గాయం పెద్దది ఏమి కాదు…
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీవీఎస్ లక్ష్మణ్ సుపరిచితుడే. హైదరాబాద్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్… అంతర్జాతీయ క్రికెట్ కు అక్టోబర్ 12 వ తేదీ 2012 సంవత్సరంలో గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత… ఐపీఎల్ టోర్నీ జట్టు అయిన డెక్కన్ చార్జెస్ కు కెప్టెన్ గా వ్యవహరించారు లక్ష్మణ్. అయితే.. వయసు మీద పడుతుండటంతో.. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టుకు మెంటర్ గా…
క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్‌తో తెగట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్లో కేఎల్…