ఈ నెలల్లో భారత జట్టు వెళ్లనున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టును ప్రకటిస్తున్న సమయంలో భారత క్రికెట్ బోర్డు రోహిత్ శర్మను వెళ్లే టీ 20 తో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ విరాట్ కోహ్లీ తన నాలుగేళ్ల కాలంలో ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయినందుకె అతను వన్డే అంతర్జాతీయ కెప్టెన్ గా తొలగించబడ్డాడని 2012లో భారత పురుషుల జట్టుకు జాతీయ సెలెక్టర్‌గా ఉన్న సబా కరీమ్ అన్నారు.
అయితే కోహ్లీ 2017లో ధోని నుండి భారత పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి అతను నాలుగు ఐసీసీ టోర్నీలలో భారత జట్టును నడిపించాడు. కానీ అందులో రెండు ఫైనల్స్ లో ఓడిపోగా.. ఒక్క దాంట్లో సెమీస్ లో వెనుదిరిగాము. అలాగే ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేదు. కాబట్టే అతడిని కెప్టెన్ గా తప్పించి ఉంటారు అని సబా కరీమ్ తన అభిప్రాయం వ్యక్తం చేసారు.