దక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. గతంలో ప్రకటించిన జట్టులో వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడి సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు స్థానం కల్పించారు. ఈ మేరకు బౌలర్లు జయంత్ యాదవ్, నవదీప్ సైనీలను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జనవరి 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 19న తొలి వన్డే, 21న రెండో వన్డే,…
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రస్తుతం కేప్‌టౌన్ వేదికగా ఆ దేశంతో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.. ఈ లిస్ట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 1,161 పరుగులతో…
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. మరోసారి అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో పుజారా (43), రిషబ్ పంత్ (27) తప్ప ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు, మాక్రో జాన్సన్ 3 వికెట్లతో సత్తా చాటారు. Read Also: అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్…
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. భారత జట్టు వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ఈనెల 12న కేప్ టౌన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఇతర సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు…
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సఫారీ బౌలర్లు విజృంభించారు. దీంతో 33 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 12 పరుగులు చేసి 31 పరుగుల వద్ద ఓలీవర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మరో రెండు పరుగులకే భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 15 పరుగులు…
టీమిండియా ఓపెనర్, యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో అజాజ్ పటేల్‌తో పాటు మాయంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. ఈ అవార్డు అజాజ్‌నే వరించింది. భారత్-న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన ముంబై టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ చరిత్ర…
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. కేప్‌టౌన్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఫిట్నెస్ కూడా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే రెండో టెస్టులో గాయపడ్డ సిరాజ్… మూడో టెస్టుకు సిద్ధంగా లేడని కోహ్లీ స్పష్టం…
టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌కు సంబంధించి ఐసీసీ ప్రతి నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన షార్ట్ లిస్టులో టీమిండియా నుంచి మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ నుంచి అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్ ఉన్నారు. Read Also: రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్ న్యూజిలాండ్‌పై…
కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.…
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత బౌలర్లు అదరకొట్టారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు పంపుతూ 226 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత్ పేసర్ శార్ధుల్ ఠాకూర్ 7 వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. అలాగే మహమ్మద్ షమీ రెండు బుమ్రా ఒక వికెట్లను పడగొట్టారు. కాగా శార్ధుల్ ఠాకూర్ కేవలం 17.5 ఓవర్లలోనే 7 వికెట్లను పడకొట్టి కేరీర్ లోనే ది బెస్ట్ ప్రదర్శనను…