టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Read Also: ఐపీఎల్: అహ్మదాబాద్ కెప్టెన్‌గా…
టీమ్ ఇండియా సారధిగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు శనివారం తెరపడింది. కాదు, తనకు తాను తెర దించాడు. ఆయన నాయకత్వంలో టీంఇండియా ప్రతిభతో నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయపథంలో పరుగులు తీసింది. భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన అతిరథ మహారధుడు విరాట్ కోహ్లీ. ఏ ఆటలో అయినా విజయవంతమైన ఆటగాళ్లకు తమదైన ఓ ముద్ర ఉంటుంది. జట్టు సారధికి కూడా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా భారత క్రికెట్‌పై కోహ్లీ…
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం నాడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఏడేళ్లుగా తాను టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించానని.. ప్రస్తుతం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఏడేళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా జట్టుకోసం సర్వశక్తులు ధారపోశానని… ఎంతో నిజాయతీగా వ్యవహరించానని కోహ్లీ తెలిపాడు. ప్రతి దానికి ఏదో…
టీమిండియా జట్టులో గత రెండేళ్లుగా పుజారా, రహానెలకు బీసీసీఐ వరుస అవకాశాలను ఇస్తోంది. అయినా వాళ్లిద్దరూ అరకొర సందర్భాల్లో తప్పితే పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా పుజారా అయితే రెండేళ్లుగా సెంచరీనే చేయలేదు. ఇక రహానె పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రహానె ఓ ఇన్నింగ్స్‌లో బాగా ఆడితే 10 ఇన్నింగ్సులు ఆడకుండానే జట్టులో స్థానం సంపాదిస్తున్నాడు. దీంతో జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసే ఉదాహరణ. పుజారా,…
కేప్‌టౌన్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. మళ్లీ భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 10 పరుగులు, మయాంక్ అగర్వాల్ 7 పరుగులు మాత్రమే చేశారు. 24 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో పుజారా, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. పుజారా 31 బంతుల్లో 9 పరుగులతో, కోహ్లీ 39 బంతుల్లో 14 పరుగులతో క్రీజులో…
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌ను సఫారీ జట్టును 210 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా జట్టులో పీటర్సన్ 72 పరుగులతో రాణించాడు. బవుమా 28, కేశవ్ మహారాజ్ 25, డస్సెన్ 21 పరుగులు చేశారు. Read Also: టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్‌లకు చోటు భారత బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు…
దక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. గతంలో ప్రకటించిన జట్టులో వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడి సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు స్థానం కల్పించారు. ఈ మేరకు బౌలర్లు జయంత్ యాదవ్, నవదీప్ సైనీలను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జనవరి 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 19న తొలి వన్డే, 21న రెండో వన్డే,…
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రస్తుతం కేప్‌టౌన్ వేదికగా ఆ దేశంతో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.. ఈ లిస్ట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 1,161 పరుగులతో…
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. మరోసారి అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో పుజారా (43), రిషబ్ పంత్ (27) తప్ప ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు, మాక్రో జాన్సన్ 3 వికెట్లతో సత్తా చాటారు. Read Also: అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్…
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. భారత జట్టు వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ఈనెల 12న కేప్ టౌన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఇతర సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు…