భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మార్కరమ్ (7) వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 11, కీగన్ పీటర్సన్ 14 క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 202 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు తడబడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50), రవిచంద్రన్ అశ్విన్ (46)…
భారత క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే జోహన్నెస్ బర్గ్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలవనున్నాడు. Read Also: క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు రెండో టెస్టుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న జొహనెస్‌బర్గ్ వేదికలో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. అయితే చాలామంది ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఇంకా ‘పుష్ప’ ట్రాన్స్ లోనే ఉన్నారు. అందుకు నిదర్శనమే తాజాగా హనుమ విహారి చేసిన పోస్ట్. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాలో ఉన్న హనుమ విహారి తాజాగా ‘పుష్ప’ సినిమా…
టెస్ట్ ఫార్మాట్‌కు సంబంధించి 2021కి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ ఈ ఏడాది 14 టెస్టులు ఆడగా… అందులో 8 విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్… అక్కడ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ…
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 305 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికాను 191 పరుగులకే భారత బౌలర్లు అవుట్ చేశారు. దీంతో 113 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో ఎల్గర్(77), బవుమా(35), డికాక్(21) తప్ప మిగతా వారు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో…
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో భారత దిగ్గజ బౌలర్లకు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా 3 వికెట్లు సాధించాడు. తద్వారా విదేశాల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. బుమ్రా ఈ రికార్డును కేవలం 23 మ్యాచ్‌ల ద్వారానే 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. Read Also: ఈ ఏడాది టెస్టుల్లో ఇంగ్లండ్…
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల జట్టు 197 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును బవుమా కాపాడాడు. బవుమా ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. బవుమా (52), డికాక్ (34) రాణించారు. బౌలర్ రబాడ బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ చివర్లో అతడు 25 పరుగులు చేశాడు. Read Also: తొలి ఇన్నింగ్స్‌లో 327…
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. సఫారీల తొలి ఇన్నింగ్స్ సందర్భంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా గాయపడటం టీమిండియాను ఆందోళనకు గురిచేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతి వేస్తున్న సమయంలో బుమ్రా పాదం మెలిపడింది. దీంతో కింద కూర్చుండిపోయిన అతడు తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. Read Also: రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అయితే బుమ్రా పరిస్థితిని గమనించిన టీమిండియా…
పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయితే పలు పార్టీలు సెలబ్రిటీలకు గాలం వేస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌కు చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా బీజేపీలో చేరారు. దినేష్ మోంగియా టీమిండియా తరఫున 57 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడారు. వన్డేల్లో 57 మ్యాచ్‌లు ఆడి 1230 పరుగులు, ఒక…
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 327 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట వర్షార్పణం కాగా మూడో రోజు ఆటలో భారత్ తీవ్రంగా ఇబ్బందులు పడింది. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే… సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 123 పరుగుల వద్ద కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే రహానె కూడా 48 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ వికెట్లు కోల్పోయింది.…