Team India: చరిత్ర సృష్టించిన భారత్.. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత పదేళ్లుగా టీమిండియా సొంతగడ్డపై ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత్ తర్వాత స్వదేశంలో అత్యధిక టెస్ట్ సిరీస్‌లను గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్‌లను తమ ఖాతాలో వేసుకుంది. 1994 నవంబర్ నుంచి 2000 నవంబర్ మధ్యలో ఒకసారి, 2004 జూలై నుంచి 2008 నవంబర్ వరకు మరోసారి ఆసీస్ ఈ ఘనత సాధించింది.
అటు భారత్ చివరిసారిగా 2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓటమిపాలైంది. ధోనీ సారథ్యంలో ఈ పరాజయాన్ని జట్టు మూటగట్టుకుంది. అప్పటి నుంచి భారత్ స్వదేశంలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోలేదు. అంతేకాకుండా 2016 నుంచి అత్యధిక టెస్టులను గెలిచిన జట్టుగా కూడా టీమిండియా రికార్డు సాధించింది. 2016 నుంచి టీమిండియా మొత్తం 67 టెస్టులు ఆడగా 41 మ్యాచ్‌లలో గెలిచింది. 10 డ్రా కాగా 16 టెస్టుల్లో ఓడిపోయింది. ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇంగ్లండ్ 80 టెస్టులు ఆడి 33 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 13 మ్యాచ్‌లను డ్రాగా ముగించగా 34 టెస్టుల్లో ఓటమిపాలైంది.
Also Read
- Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
- IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..

తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!