Virat Kohli: రన్ మెషిన్‌కు ఏమైంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్‌గా పేరుపొందిన విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను నిరాశపరుస్తున్నాడు.. శ్రీలంకతో రెండో టెస్టులో విరాట్ కోహ్లి అవుటైన తీరు ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎలా అవుటయ్యాడో.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సేమ్ టు సేమ్. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో అవుటైతే.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. విరాట్ కోహ్లి ఇప్పటివరకు 101 టెస్టులు ఆడాడు. వందో టెస్టులో 45 పరుగులు చేసిన విరాట్.. ఇక బెంగళూరు టెస్టులో రాణిస్తాడని అభిమానులు ఆశించారు. పైగా RCB కెప్టెన్‌గా తన సొంత మైదానంలో చెలరేగిపోతాడని కోహ్లి ఫ్యాన్స్ ఆశించారు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ అవుటైన తీరు అభిమానుల్ని నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 23, సెకండ్ ఇన్నింగ్స్‌లో 13 పరుగులు మాత్రమే చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 50 పరుగులు కూడా చేయలేకపోయాడు విరాట్.
Read Also: TS RTC: ‘ఆర్ఆర్ఆర్’నీ వదలని సజ్జనార్.. ఫిదా కావాల్సిందే..
Also Read
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
- WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
కింగ్ కోహ్లి పరుగులు చేయడానికి.. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు సెంచరీల మీద సెంచరీలు కొట్టిన కోహ్లికి.. ఇప్పుడు శతకం అనేది అందని ద్రాక్షగా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్‌లో సెంచరీ సాధించాడు. అంటే దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. కోహ్లి బ్యాటింగ్‌లో ఎందుకు వరుసగా ఫ్లాప్ అవుతున్నాడని.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతమెంతో ఘనం.. ఇప్పుడు మాత్రం సతమతంలా తయారైంది టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి. దూకుడు మంచిదే.. కానీ అన్ని సందర్భాల్లో అది పనికి రాదు. రన్స్ చేస్తున్నంత కాలం.. ఎలా ఉన్నా నడుస్తుంది. అదే బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయి.. ఫామ్ కోల్పోతే.. ఒక్కో పరుగు చేయడం గగనమవుతుంది. సెంచరీల సంగతి తర్వాత.. కనీసం హాఫ్ సెంచరీలు కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు కోహ్లిది అదే సిట్యువేషన్. ఆది నుంచి వివాదాలతో.. అర్థాంతరంగా మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతల నుంచి అవమానకర రీతిలో తప్పుకున్నాడు. ఏకంగా బీసీసీఐతోనే గిల్లికజ్జాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు పరుగులు చేయలేక కిందా మీద పడుతున్నాడు.
- Tags
- bcci
- india
- Team India
- VIRAT KOHLI
తాజావార్తలు
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..