ICC WTC: పాయింట్ల పట్టికలో మెరుగైన టీమిండియా ర్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. 58 శాతం విజయాలతో ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లు ఆడిన టీమిండియా ఆరు విజయాలు సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మొత్తంగా టీమిండియా ఖాతాలో 77 పాయింట్లు ఉన్నాయి.
ఇంగ్లండ్‌తో భారత్ నాలుగు టెస్టులు ఆడగా అందులో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రా ఉన్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడగా ఒక విజయం, ఒక డ్రా ఉన్నాయి. దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టులు ఆడగా ఒక విజయం, రెండు పరాజయాలు నమోదయ్యాయి. ప్రస్తుతం సొంతగడ్డపై శ్రీలంకతో రెండు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించింది. కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 సిరీస్‌లు మాత్రమే ఆడిన ఆస్ట్రేలియాకు 77 శాతం విజయాలు ఉన్నాయి. ఆరు టెస్టుల్లో నాలుగింట్లో గెలిచిన ఆ జట్టు రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..

తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!