ఎవరికైనా కొన్ని కలిసివచ్చే నెంబర్లు ఉంటాయి.. ఆ తేదీలో లేదా ఆ నెలలో.. ఏది చేసిన వాళ్లకు కలిసివచ్చే సందర్భాలుంటాయి.. దీంతో అవే తమ లక్కీ నెంబర్లుగా ఫాలో అయిపోతుంటారు.. ఇక, వికెట్ కీపర్‌గా టీమిండియాలో అడుగుపెట్టి.. జట్టును విజయాల బాట పట్టించిన జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది జెర్సీ నెంబర్ 7.. ధోనీ వికెట్ల వెనుక చురుకుగా కదిలే విధానం.. బ్యాటింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్నీ ఆ నెంబర్‌కు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టాయి.. భారత క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అన్ని ఫార్మాట్లలో విజయాలు.. ట్రోపీలు అందించిన మిస్టర్ కూల్.. ఆ నెంబర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపెట్టారు.
Read Also: Kuwait: ట్రిపుల్ మర్డర్ కేసు.. జైల్లోనే నిందితుడి ఆత్మహత్య
జెర్సీ నెంబర్ 7 వెనుక ఉన్న సీక్రెట్‌ను బయటపెట్టిన మహేంద్రసింగ్ ధోనీ… ఆ నెంబర్ జర్నీ ధరించడం వెనుక తన పుట్టినరోజు ఉందని చెప్పుకొచ్చాడు… అసలు 7 నా లక్కీ నెంబర్ కాదన్న ధోనీ.. నేను 7వ నెల, 7వ తేదీన జన్మించానని.. అందుకే నెంబర్ 7 నచ్చిందని అసలు విషయం బటయపెట్టాడు. 7 నెంబర్ జెర్సీ ఇకపై నా దగ్గరే ఉంటుందన్నారు. కాగా, తన కెరీర్ మొత్తం 7 నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగారు ఎంఎస్ ధోనీ.. వికెట్ కీపర్ నుంచి.. క్రమంగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు.. జట్టు క్లిస్ట సమయంలో ఉన్నప్పుడు వేసే డేరింగ్ స్టెప్పులు, విజయం దక్కినా.. ఓటమి ఎదురైనా.. కూల్‌గా ఉండే అతని నైజం.. ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.