Team India: చెత్తగా ఆడుతున్న కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత 50 దిగువకు సగటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు కనీసం హాఫ్ సెంచరీలైనా చేస్తున్నాడని అభిమానులు మురిసిపోయారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. సెంచరీ సంగతి పక్కన బెడితే… కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. టెస్టు కెరీర్లో కోహ్లీ సగటు ఏకంగా 50కి దిగువకు పడిపోయింది. దీంతో ఇన్నాళ్లు 3 ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో ఉన్న కోహ్లీ ప్రస్తుతం ఆ ఘనతకు దూరమయ్యాడు.
ప్రస్తుతం టెస్టుల్లో విరాట్ కోహ్లీ సగటు 49.96గా ఉంది. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సగటు 50 నుంచి 49.55కి దిగజారింది. తాజాగా అదే శ్రీలంకతో కోహ్లీ సగటు మళ్లీ 49కి దిగజారింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 23, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేశాడు. కాగా ఇప్పటివరకు 101 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 49.96 సగటుతో 8043 పరుగులు చేశాడు. టీమిండియా మళ్లీ జూలై వరకు టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడంతో అప్పటివరకు కోహ్లీ సగటు 49గానే ఉండనుంది.
Also Read
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
- Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
- Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
తాజావార్తలు
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!