కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సఫారీ బౌలర్లు విజృంభించారు. దీంతో 33 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 12 పరుగులు చేసి 31 పరుగుల వద్ద ఓలీవర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మరో రెండు పరుగులకే భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 15 పరుగులు…
టీమిండియా ఓపెనర్, యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో అజాజ్ పటేల్‌తో పాటు మాయంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. ఈ అవార్డు అజాజ్‌నే వరించింది. భారత్-న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన ముంబై టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ చరిత్ర…
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. కేప్‌టౌన్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఫిట్నెస్ కూడా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే రెండో టెస్టులో గాయపడ్డ సిరాజ్… మూడో టెస్టుకు సిద్ధంగా లేడని కోహ్లీ స్పష్టం…
టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌కు సంబంధించి ఐసీసీ ప్రతి నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన షార్ట్ లిస్టులో టీమిండియా నుంచి మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ నుంచి అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్ ఉన్నారు. Read Also: రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్ న్యూజిలాండ్‌పై…
కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.…
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత బౌలర్లు అదరకొట్టారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు పంపుతూ 226 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత్ పేసర్ శార్ధుల్ ఠాకూర్ 7 వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. అలాగే మహమ్మద్ షమీ రెండు బుమ్రా ఒక వికెట్లను పడగొట్టారు. కాగా శార్ధుల్ ఠాకూర్ కేవలం 17.5 ఓవర్లలోనే 7 వికెట్లను పడకొట్టి కేరీర్ లోనే ది బెస్ట్ ప్రదర్శనను…
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మార్కరమ్ (7) వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 11, కీగన్ పీటర్సన్ 14 క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 202 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు తడబడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50), రవిచంద్రన్ అశ్విన్ (46)…
భారత క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే జోహన్నెస్ బర్గ్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలవనున్నాడు. Read Also: క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు రెండో టెస్టుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న జొహనెస్‌బర్గ్ వేదికలో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. అయితే చాలామంది ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఇంకా ‘పుష్ప’ ట్రాన్స్ లోనే ఉన్నారు. అందుకు నిదర్శనమే తాజాగా హనుమ విహారి చేసిన పోస్ట్. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాలో ఉన్న హనుమ విహారి తాజాగా ‘పుష్ప’ సినిమా…
టెస్ట్ ఫార్మాట్‌కు సంబంధించి 2021కి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ ఈ ఏడాది 14 టెస్టులు ఆడగా… అందులో 8 విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్… అక్కడ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ…