Firecrackers on Bike: దీపావళి వచ్చిందంటే చాలు.. ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతారు.. కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సాహంగా టపాసులు పేలుస్తుంటారు.. అయితే, కొందరు యువకులు టపాసులతోనూ విచిత్రమైన వేషాలు వేస్తున్న ఘటనలు కొన్ని చూస్తూనే ఉన్నాం.. ఈ మధ్యే టైగర్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ బాణాసంచా కాల్చి.. ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేసిన ఘటన మరువక ముందే.. కొందరు యువకులు బైక్‌పై డేంజర్స్ స్టంట్స్ చేయడమే కాదు.. ఆ స్టంట్స్‌లో బాణాసంచా కాల్చుతూ.. దారిన పోయేవారికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు.. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు..
Read Also: Animal Song: నాన్నకు ప్రేమతో… ఏ సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్
రోడ్డుపై వెళ్తూ బైక్‌పై స్టంట్స్ చేస్తేనే.. వెనుక.. ముందు వెళ్లే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది.. అంతేకాదు.. అదుపుతప్పితే ప్రమాదాలు కూడా కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.. అయితే.. ఓ యువకుడు తన బైక్‌కు ముందు ఉన్న లైట్ భాగంలో టపాసులను అమర్చాడు. ఇక, ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టి.. రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా.. బైక్ ముందు టైర్లను గాల్లోకి లేపి ప్రమాదకర స్టంట్స్ చేశాడు. బైక్‌పై స్టంట్స్ చేస్తూ.. బాణాసంచా కాల్చుతూ.. ఆనందం పొందాడేమో.. కానీ, అది ఇతరులకు ఇబ్బందిగా మారింది.. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. రంగంలోకి దిగిన తమిళనాడులోని తిరుచ్చి పోలీసులు.. ఆ యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. మరోవైపు.. గురుగ్రామ్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.. ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాలుస్తూ.. సైబర్ సిటీ ప్రాంతంలో హల్‌చల్ చేశాడు.. ఈ దృశ్యాలుకూడా సోషల్ మీడియాకు ఎక్కాయి.. ఆ వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీపావళి అంటే ఆనందంగా జరుపుకోవాలి.. ఇలాంటి పైశాచిక ఆనందం దేనికి.. ఊచలు లెక్కపెట్టడం దేనికోసం.. దూల తీరిందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
இன்னொன்னு 🤬 https://t.co/DPmRpBiG8Z pic.twitter.com/UEoAucEpaX
— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) November 12, 2023