Wife kills husband: తమిళనాడులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. ప్రియుడి మోజులో పడిన సదరు ఇల్లాలు అతడితో కలిసి భర్తను కడతేర్చింది. తిరుచ్చి పోలీసులు ఈ హత్యకు పాల్పడిన మహిళ వినోదిని(26), ఆమె లవర్ భారతి(23)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటకు సహకరించిన మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు.
వినోదిని, భారతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమె భర్త పూలవ్యాపారి ప్రభు(30)ని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హత్య చేసింది. అప్పటికే వినోదినికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రభుకు నిద్ర మాత్రలను ఇచ్చిన వినోదిని, ఆమె ప్రియుడు భారతి, అతని స్నేహితుల సాయంతో గొంతు కోసి హత్య చేసింది.
ఈ హత్య అనంతరం భారతి, అతని స్నేహితులు తిరుచ్చి-మదురై హైవే సమీపంలో మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వర్షం కురవడంతో ఈ పథకం సాధ్యం కాలేదు. అనంతరం ప్రభు మృతదేహాన్ని నరికి కావేరి, కొల్లిడం నదుల్లో పారేశారు. వినోదిని, భారతి, అతని స్నేహితులు రూబెన్ బాబు, దివాకర్, శర్వణ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
Read Also: Israel-Hamas War: గాజా ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయిల్ సైన్యం..
నవంబర్ 5న ప్రభు సోదరుడు ఇంటికి వెళ్లి చూడగా.. తన భర్త ఇంటికి రాలేదని వినోదిని తెలిపింది. ప్రభు సోదరుడు అతనిని వెతికేందుకు మార్కెట్ వెళ్లాడు. ప్రభు ఆచూకీ లభించకపోవడంతో సమయపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భారతితో వినోదిని వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ప్రభును తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
హత్యకు ముందే వినోదిని, భారతి మూడు నెలల క్రితం సంధాయ్ గేట్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం ప్రభుకు అనుకోకుండా తెలిసింది. భారతితో సంబంధాన్ని తెంచుకోవాలని వినోదిని ప్రభు హెచ్చరించాడు. ఈ వివాదం కారణంగా వీరిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. అయితే గత 10 రోజులుగా వినోదిని భారతిని కలవలేదని, అయితే అతని సాయంతో ప్రభుని హత్య చేయాలని భావించిందని ప్రభు అన్న ఆరోపించాడు. నవంబర్ 4న తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని నిద్రమాత్రలు వేసింది, మత్తులోకి జారుకోగానే గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. హత్య తర్వాత భారతి తన ముగ్గురు స్నేహితులను పిలిచి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి కావేరి నదిలో మొండెం, మిగిలిన భాగాలను కొల్లిడం నిదిలో విసిరేశారు.