CM Stalin: అసెంబ్లీలో సీఎం స్టాలిన్ కీలక తీర్మానం.. గవర్నర్‌పై సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక తీర్మానం ప్రవేశ పెట్టారు. గతంలో అమోదం పొందిన సుమారు 10 బిల్లులను పాస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి చర్యలు తీసుకోవాలి కోరారు. 2020, 2023లో రెండు బిల్లులకు ఆమోదం దక్కిందని, మరో ఆరు బిల్లులు గత ఏడాది పాస్ చేశామని, కానీ ఇంత వరకు గవర్నర్ ఆ బిల్లులకు ఓకే చెప్పలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ఎటువంటి కారణాలు లేకుండానే గవర్నర్ రవి అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను తిప్పి పంపినట్లు సమావేశంలో స్టాలిన్ ఆరోపించారు.
రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం ఆ బిల్లులను మళ్లీ పాస్ చేశామని, తమిళనాడు అసెంబ్లీ రూల్ 143 ప్రకారం కూడా బిల్లులకు ఆమోదం దక్కిందని స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను గవర్నర్ రవి అడ్డుకుంటున్నారన్నారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్ తమ బిల్లులను వెనక్కి పంపారని, ఇది అప్రజాస్వామికమని సీఎం అన్నారు. అలాగే నాన్ బీజేపీ రాష్ట్రాలను కేంద్రం కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తిక చేసుకోవాలని, కానీ ఆ బిల్లులకు ఆమోదం ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను గవర్నర్ రవి అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!