Dayanidhi Maran: హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. వాళ్లు టాయిలెట్లు క్లీన్ చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dayanidhi Maran: హిందీ భాషపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తూనే ఉంది.. మరీ ముఖ్యంగా తమపై హిందీని బలవంతంగా రుద్దవద్దని దక్షిణ భారత్‌లోని రాష్ట్రాలు పలు సందర్భాలు స్పష్టం చేశాయి.. ఇదే సమయంలో.. కొన్నిసార్లు హిందీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. తాజాగా, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. హిందీని తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేశారు.. అందులో భాగంగా.. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు కడుతున్నారు.. రోడ్లు శుభ్రం చేస్తున్నారని పేర్కొన్నారు.. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. కొందరు సపోర్ట్ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు దయానిధి మారన్‌పై ఫైర్ అవుతున్నారు..
Read Also: Sriya Reddy: సలార్ కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాను షాక్ చేస్తున్న శ్రీయ రెడ్డి…
Also Read
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
తమిళనాడుకు వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల వాసులు.. హిందీ మాట్లాడేవారు.. ఇక్కడ నిర్మాణ పనులు లేదా రోడ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయడం వంటి నీచమైన పనులు చేస్తుంటారని మారన్ వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఇక, ఆ వీడియోపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందిస్తూ.. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.. ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరం అన్నారు. మొదట రాహుల్ గాంధీ ఉత్తర భారత ఓటర్లను అవమానించారు. కొందరు బీహార్ డీఎన్ఏను దుర్భాషలాడారు. అప్పుడు డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ “గౌమూత్ర రాష్ట్రాలు” అన్నారు. ఇప్పుడు దయానిధి మారన్ హిందీ మాట్లాడేవారిని, ఉత్తరాది వారిని అవమానించాడు. సనాతన ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, ఆపై విభజించి రూల్ కార్డ్ ప్లే చేయడం ఇండియా కూటమి యొక్క డీఎన్‌ఏ.. నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించరా? వారు ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు? అంటూ బీజేపీ నాయకుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Read Also: Cold Intensity: తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఇక, డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలతో వివాదానికి దారితీసిన కొద్ది రోజుల తర్వాత మారన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమిళనాడు నాయకుడు, ఇటీవలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలను ఎగతాళి చేస్తూ, హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. ప్రధానంగా హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపొందడంలో బీజేపీకి ఉన్న శక్తి ఉంది. మీరు దక్షిణ భారతదేశానికి రాలేరు అని ఆయన అన్నారు. సంచలనం రేపిన సెంథిల్‌కుమార్ చేసిన వ్యాఖ్యను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు.
- Tags
- bihar
- Dayanidhi Maran
- DMK
- Hindi
- Roads
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!