Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు పొడిచింది. హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అప్నాదళ్(కే)తో పొత్తు కుదుర్చుకున్న మజ్లిస్ పార్టీ, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించింది.
P Chidambaram: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు వస్తాయని, 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో సీట్లు పెరుగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం శనివారం అన్నారు.
కాంగ్రెస్ అగ్ర రాహుల్‌గాంధీ తమిళనాడులో సందడి చేశారు. చెన్నైలో రోడ్డు పక్కన ఉన్న ఓ స్వీట్ షాపులోకి వెళ్లి స్వీట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్వీట్ బాక్సును నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు. దాన్ని అందుకున్న స్టాలిన్.. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి విక్టరీ సాధించబోతుందని.. జూన్ 4న ఇలాంటి తీపి కబురే దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం.. రాహుల్ గాంధీ…
Annamalai: తమిళనాడులో పొలిటికల్ హీట్ పీక్స్‌కి చేరింది. అధికార డీఎంకే, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై అధికార డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే పార్టీని ‘దుష్టశక్తి’గా అభివర్ణించారు.
Tamil Nadu: లోక్‌సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో వేగంగా వస్తున్న కారు.. బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది.
లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో.. తమిళనాడులోని కడలూరు లోక్‌సభ నియోజకవర్గం ప్రజల భవిష్యత్తును అంచనా వేస్తున్న చిలుక యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఉన్న.. కడలూరు పీఎంకే అభ్యర్థి తంగర్ బచ్చన్ ఓ చెట్టు కిందకు వచ్చి సేదతీరుతుండగా, చిలుక జోస్యుడు కనపడ్డాడు. దీంతో తనకు జోస్యం చెప్పమని అడిగారు. ఆ చిలుక జోస్యుడు…
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.