Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తొలి విడత పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి దశలోనే తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు అన్నామలై తన సొంతగ్రామమైన కరూర్‌లోని ఉత్తుపట్టి పోలింగ్ బూత్‌లో ఓటేశారు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన అన్నారు. జూన్ 4లో ఎన్డీయేకి అనుకూలంగా చారిత్రాత్మక ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
Read Also: Israel Attack: ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలు సేఫ్.. దేశవ్యాప్తంగా విమానాల నిలిపివేత..
తమిళనాడు ప్రజలు మోడీ వెంట ఉన్నారని, కర్ణాటకలో ఈ సారి బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, తెలంగాణలో నెంబర్ వన్ పార్టీగా బీజేపీ ఉందని ఆయన అన్నారు. కోయంబత్తూర్ నుంచి అన్నామలై లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి అన్నామలైకి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ నుంచి గణపతి పి రాజ్ కుమార్, అన్నా డీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం అన్నామలై మాట్లాడుతూ.. తను కోయంబత్తూర్ నుంచి ఓడించేందుకు అధికార డీఎంకేతో పాటు ఏఐడీఎంకేలు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు.