Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు.. అన్నాడీఎంకేతో జతకట్టిన ఎంఐఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు పొడిచింది. హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అప్నాదళ్(కే)తో పొత్తు కుదుర్చుకున్న మజ్లిస్ పార్టీ, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఆ పార్టీకి శనివారం ఎంఐఎం మద్దతు ప్రకటించింది. గతంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని, భవిష్యత్తులో పొత్తు పెట్టుకోకూడదని భావిస్తోంది.
Read Also: Chandrababu: మూడు జెండాలతో వచ్చినా.. మూడు పార్టీలతో వచ్చినా.. అజెండా ఒక్కటే
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. తమిళనాడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తామని అన్నాడీఎంకే ప్రకటించడంతో ఎంఐఎం ఆ పార్టీకి మద్దతు అందిస్తోంది. గతంలో ఎంఐఎం 2021లో టీటీవీ దినకరన్‌కి చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఎఎంఎంకే)తో పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో మూడు స్థానాల నుంచి పోటీ చేసింది. అప్పుడు అన్నాడీఎంకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగంగా ఉండేది. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలివిడతలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!