PM Modi: తమిళ పార్టీ డీఎంకేతో పాటు దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. డీఎంకేపై తమిళ ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉందని, ఇది ప్రజల్ని బీజేపీ వైపు మళ్లేలా చేస్తుందని ప్రధాని ఈరోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బీజేపీ ఐదు తరాలుగా దక్షినాది రాష్ట్రాల్లో పనిచేస్తోందని, ప్రజలు కాంగ్రెస్‌పై నిరాశ చెందినప్పుడు ప్రాంతీయ పార్టీల వైపు వెళ్లారని, ఇప్పుడు వాటితో విసుగు చెందిన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రధాని అన్నారు.
వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న తమిళ ప్రజలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని అక్కడి వాళ్లకు చెబుతున్నారని, ‘‘తమిళ కాశీ సంగమాన్ని’’ నిర్వహించే సమయంలో డీఎంకే పార్టీ తమను ‘పానీపూరి వాలా’ అంటూ ఎగతాళి చేసింది. కానీ తమిళ ప్రజలు కాశీ సంగమానికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి, తాము వినేది నిజం కాదని గమనించారని ప్రధాని అన్నారు.
Read Also: Abhishek Sharma: సిద్ధూ మూసేవాలాకు బిగ్ ఫ్యాన్ను.. నా ఆరాధ్యదైవం ఎవరో తెలుసా..?
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఆయన మంచి నాయకుడని, బీజేపీ కుటుంబ పార్టీ కాదని అందరికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. యువకుడు ఐపీఎస్ క్యాడర్ వదిలేసి బీజేపీలో చేరారని, ఒక వేళ ఆయన డీఎంకేలోకి వెళ్తే పెద్ద పేరు తెచ్చుకునే వారు కానది అన్నారు. ప్రతీ కార్యకర్తకు బీజేపీ అవకాశం ఇస్తుందని, కుటుంబ పార్టీల్లో ఇలాంటివి ఉండవని చెప్పారు. మహాత్మా గాంధీ పేరుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ, మెడలో రద్రాక్ష మాల ధరించిన ఇందిరా గాంధీతో సంబంధం ఉన్న కాంగ్రెస్, సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్న డీఎంకేతో ఎందుకు అంటకాగుతుందని ప్రధాని ప్రశ్నించారు.
డీఎంకే నేతలు ప్రత్యేక దేశం అని పలుమార్లు వ్యాఖ్యానించడం మాట్లాడుతూ.. భారత్ పూర్తిగా వైవిధ్యం కలిగిన దేశమని ప్రధాని సమాధానమిచ్చారు. బీజేపీ 400 స్థానాలు గెలిస్తే ఒకే భాష, ఒకే మతం అని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని ఫైర్ అయ్యారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లి ప్రపంచంలోనే అతి పురాతన భాష ‘తమిళం’ అని చెప్పిన వ్యక్తి గురించి ఎలా విమర్శి్స్తున్నారో నాకు అర్థం కావడం లేదని అన్నారు.