K Padmarajan: తమిళనాడుకు చెందిన కే పద్మరాజన్ ఏకంగా 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు. ‘‘గెలుపెరగని యోధుడి’’గా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యే మొదలుకొని స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఓడిపోయి రికార్డు సృష్టించారు.
Udhayanidhi Stalin: ప్రధాని నరేంద్రమోడీని ఇంటికి సాగనంపే వరకు మేము నిద్రపోము అని డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ డీఎంకు, ఇండియా కూటమిని ఉద్దేశించి విమర్శలు చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై హాట్ కామెంట్స్ చేశారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావొద్దని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలంగా మారుతుందని ఓట్లర్లను ఆయన హెచ్చరించారు.
Annamalai: బీజేపీ దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేసింది. ముఖ్యంగా తమిళనాడులో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి కారణం మాజీ ఐపీఎస్ అధికారి, తమిళ సింగంగా పేరు తెచ్చుకున్న కె. అన్నామలై. 37 ఏళ్ల ఈ యంగ్ పొలిటిషియన్ని బీజేపీ తమ భవిష్యత్తుగా భావిస్తోంది. అందుకనే అతి తక్కువ వయసులో తమిళనాడు వంటి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ పార్టీ అన్నామలైని చాలా స్పెషల్గా భావిస్తోంది.
గత కొద్ది రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు.
PM Modi: ఇండియా కూటమి నేతలు ఉద్ధేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యాడు. తమిళనాడు సేలంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం పాల్గొన్నారు. ఏప్రిల్ 19న ప్రతీ ఒక్కరూ బీజేపీ-ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్తించారు.
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.