Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి మంత్రి వర్గంలో ప్రమోషన్ వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి, స్టాలిన్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే, త్వరలోనే మంత్రివర్గంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతుంది. డీఎంకేలో మరో యువ నాయకుడ్ని ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీలో అన్నామలై లాంటి యువ నాయకులు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు.
Tamil Nadu: ప్రముఖ యూట్యూబర్, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) నాయకుడు సట్టాయ్ దురైమురుగన్ని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. డీఎంకే పితామహుడు, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Annamalai: తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ అన్నామలై ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగైని ఉద్దేశిస్తూ హిస్టరీ-షీటర్‌గా పేర్కొన్నారు.
Pa Ranjith: తమిళనాడు మాయావతికి చెందని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణహత్య రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి అధికార డీఎంకే సర్కార్ విమర్శలు ఎదుర్కొంటోంది.
K Annamalai: తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై డిమాండ్ చేశారు. విచారణ చేసేందుకు కేంద్ర ఏజెన్సీకి ఎందుకు అప్పగించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిద్ధంగా లేరని ప్రశ్నించారు.
భారత ప్రభుత్వం రూపొందించిన మూడు క్రిమినల్ చట్టాలలో రాష్ట్ర స్థాయిలో సవరణలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎం సత్యనారాయణ నేతృత్వం వహిస్తారు.
తమిళనాడులో మరో రాజకీయ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు, దళిత నాయకుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను ఇంకా మరువక ముందే మరో నాయకుడిపై హత్యాయత్నం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కొందరు దుండగులు దారుణంగా నరికి హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని చెన్నై అదనపు కమిషనర్(నార్త్) అస్రా గార్గ్ వెల్లడించారు.