Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం వల్ల మనవరాలు పుట్టిందనే అనుమానంతో మనవరాలినీ ఓ అవ్వ చంపేసింది. ఆరియాలూర్ జిల్లా కోట్టాకాడులో ఈ ఘటన జరిగింది. కుమారుడు రాజాకు, సంధ్యతో కొన్నేళ్ళ క్రితం వివాహం అయ్యింది.. మొదటి బిడ్డ పుట్టిన తరువాత రాజు విదేశాలకు వెళ్ళిపోయాడు.. ఆ సమయంలో రెండో గర్భం దాల్చిన సంధ్యా.. కృతిక అనే ఆడ బిడ్డా పుట్టింది.. ఈ నేపథ్యంలో ఆ బిడ్డ తన కొడుకు వల్ల కాకుండా అక్రమ సంబంధం వల్లా పుట్టిందని అనుమానం పెంచుకున్న రాజా తల్లి విరుతాంబాల్.. అదే అనుమానంతో గతరాత్రి ఒకటిన్నర సంవత్సరం ఉన్న మనవరాలిని గొంతు నులుమి హత్య చేసింది.
Read Also: CJI DY Chandrachud: పేపర్ లీక్ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చు..
అయితే, అత్తా విరుతాంబాల్ చేసినా పనితో ఘటనతో షాక్ అయినా కోడలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ కోసం విరుతాంబాల్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, చిన్నారి మృతితో సంధ్యా బోరున విలపిస్తుంది.