Annamalai: తమిళనాడు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షుల మధ్య ‘‘రౌడీ షీటర్’’ వ్యాఖ్యల వివాదం..
- తమిళనాడులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
- ఇరు పార్టీల అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ అన్నామలై ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగైని ఉద్దేశిస్తూ హిస్టరీ-షీటర్‌గా పేర్కొన్నారు. దీనిపై అన్నామలై తనకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే పరువునష్టం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసు పెడతానని హెచ్చరించారు. దీనికి బుధవారం అన్నామలై స్పందిస్తూ, తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన అన్నామలై, ఈ కేసును కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
READ ALSO: ARMY: ఉగ్రవాదుల ప్రణాళికలను..భారత ఆర్మీ పసిగట్టకపోవడానికి కారణం ఇదే..
Also Read
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
ఈ వారం ప్రారంభంలో తమిళనాడు బీఎస్పీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురయ్యాడు. ఆయనకు సంతాపం తెలుపుతూ అన్నామలై ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఎవరూ లేనిని అన్నారు. దీనిపై సెల్వపెరుంతగై స్పందిస్తూ, అన్నామలై పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 1971 కేసుల్లో ప్రమేయం ఉన్న 261 మందిని బీజేపీలో చేర్చుకున్నారని, కొందరు ఆఫీస్ బేరర్లు కూడా అయ్యారని చెప్పారు. “తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామలై బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఏ+ గ్రేడ్ రౌడీలను, సంఘవిద్రోహులను పార్టీలో నియమించారు, వారిలో 261 మందిపై 1,971 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఆయన నన్ను హిస్టరీ షీటర్‌గా పిలిచారు. వీటిని నిరూపించాలి’’ అని కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చాలా పాత పార్టీ, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హత్యానేరం, గుండా యాక్ట్ కింద కేసులు నమోదై జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉందా..? అని అన్నామలై ప్రశ్నించారు. సెల్వపెరుంతగై గూండా యాక్ట్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడయ్యాడని అన్నారు. అతను ఐదు పొలిటికల్ పార్టీలు మారారని చెప్పారు. అతను ఉన్నత పదవిలో ఉంటూ బీజేపీలో చేరిన వారిని రౌడీలని పిలుస్తున్నారని, అతను తనను తాను గాంధీ శిష్యుడిగా చెప్పుకుంటారు, గుండా చట్టం కింద జైలుకు వెళ్లాడు. మనీలాండరింగ్, సీబీఐ కేసులు ఉన్నాయని ఆరోపించారు.
- Tags
- annamalai
- bjp
- congress
- Tamil Nadu
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!