Tamil Nadu: ప్రముఖ యూట్యూబర్, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) నాయకుడు సట్టాయ్ దురైమురుగన్‌ని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. డీఎంకే పితామహుడు, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సట్టాయ్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుతుపుతున్న మురుగనన్, తెన్‌కాశీలో నిర్మాణంలో ఉన్న తన ఇంటిని చూసేందుకు వెళ్లిన సమయం అరెస్ట్ జరిగింది. అనంతరం విచారణ నిమిత్తం తిరుచ్చి సైబర్ క్రైమ్ వింగ్‌కి తరలించారు.
Read Also: Anant Ambani Wedding: పెళ్లి కోసం ముంబై వెళ్తున్న బెంగాల్ సీఎం మమత
ఏకే అరుణ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మురుగన్‌ని అదుపులోకి తీసుకున్నారు. మురుగన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోలో అసమానతలు సృష్టించే ఉద్దేశ్యంతో కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి డీ జయకుమార్ మురుగన్ అరెస్టును ఖండించారు. ఇది భావప్రకటన స్వేచ్ఛని హరించడమే అని అన్నారు. పరువుకి నష్టం కలిగించే ఉద్యమంలో డీఎంకే అనే బహుమతుల్ని గెలుచుకుందని విమర్శించారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రభుత్వ పనితీరును ఎత్తిచూపినందుకు, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న ఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు డీఎంకే మురుగన్‌ని టార్గెట్ చేసిందని జయకుమార్ అన్నారు. ఫాసిస్ట్ పాలనను నడుపుతున్న డీఎంకే పతనం ప్రారంభమైందని జయకుమార్ ట్వీట్ చేశారు.